రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడంటే ఈయన్ని వివాదాల దర్శకుడు అని అంటున్నారు కానీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అయన ఒక సంచలనం.. అయితే.. ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం అయన తీసే సినిమాలకంటే.. చేసే కంట్రవర్సీలతోనే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ట్వీట్ చేసారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

ఆర్గీవీ ట్వీట్ లో.. గత ఇరవై ఏళ్ళలో ఏ స్టార్ హీరోలోనూ చూడలేనంత స్క్రీన్ ప్రెజన్స్ “లైగర్” సినిమాలో విజయ్ దేవరకొండ కు ఉందని. అది బయటకి తీసినందుకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సినిమా నిర్మాతలో ఒకరైన ఛార్మికి ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేయడానికి కొద్దిసేపటి ముందే ‘లైగర్’ లోని కొన్ని సన్నివేశాలు చూశానని ట్వీట్ చేసారు. వెంటనే ఆర్జీవి ఈ కామెంట్స్ చేయడంతో దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో లైగర్ లో ఎలా ఉండబోతున్నాడోనని మరింత ఆసక్తితో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
The SCREEN PRESENCE of @TheDeverakonda in LIGER Is GREATER than any STAR i have seen in the last 2 DECADES..Thank you #PuriJagan and @Charmmeofficial for bringing it out ????
— Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2021

































