గర్భిణులు కూడా ఖచ్చితంగా వాక్సిన్ తీసుకోవాలి..!

0
74

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గర్భిణులు టీకాలు తీసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌తో కలిసి దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై మాట్లాడారు. వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని, అందుబాటులో డేటా సైతం గర్భిణులకు టీకాలు వేయడం సురక్షితమని సూచిస్తున్నాయని తెలిపారు.

వైరస్‌ సోకితే పిండంతో పాటు గర్భిణికి ప్రమాదం ఉంటుందన్నారు. గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. అందుకే టీకాలు వేయడం చాలా ముఖ్యమన్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here