సినిమా ఇండస్ట్రీలో నటించే వారి ప్రభావం బయట ప్రజల మీద ఎంతగా ఉంటుందో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాలలో చూశాము. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లాంటి వాళ్ళను సినిమాలలో చూసి బయట వాళ్ళ అభిమానులు ఎంతగా ఇన్స్పైర్ అయ్యారో తెలిసిందే. చాలా మంది అభిమానులు తమ అభిమాన నటులను అనుసరిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం..చేస్తుంటారు. ఇక సినిమాలలో వీరు మాత్రమే కాదు మిగతా నటులను చూసి కూడా బయట జనాలు ప్రభావితం అవుతుంటారు. కమెడియన్స్ ను చూసి ప్రభావితం అయ్యే వాళ్లు కూడా బయట చాలామంది ఉన్నారు. అలా ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణ సినిమాలలో చేసిన పాత్రలను చూసి కూడా కొంతమంది ప్రభావితులయ్యారట.

స్వయంగా ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఎం.ఎస్. నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. సినిమాలలోకి వచ్చినప్పుడు లెంగ్ ఎక్కువగా ఉందని షార్ట్ చేసి ఎం.ఎస్.నారాయణ అని స్క్రీన్ మీద వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప హాస్యనటుడుగా, దర్శకుడు, రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎం.ఎస్.నారాయణ 17 సంవత్సరాల సినీ కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో కనీసం 200 పైగా తాగుబోతు పాత్రలుండటం విశేషం. ఎం. ఎస్. నారాయణ చదువుకునే రోజుల నుంచీ కామెడీ స్క్రిప్ట్స్ రాస్తుండేవారు. ఆ విషంగానే కొన్ని నాటకాలు రాశారు.

అవి చూసిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి, తన వద్ద కొంతకాలం రచయితగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఎం.ఎస్.నారాయణకి నటుడిగా బాగా గుర్తింపు తెచ్చిన సినిమా 1997లో విడుదలైన మా నాన్నకి పెళ్ళి. ఈ సినిమాలో ఎం.ఎస్.నారాయణ ఒక తాగుబోతు పాత్రలో నటించారు. ఈ పాత్రకి విపరీతమైన పాపులారిటీ రావడంతో అటువంటి పాత్రలే 200 వరకు చేశారు. వేగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు సినిమాలకు అద్భుతమైన కథలు అందించింది ఎం.ఎస్.నారాయణ కావడం విశేషం.

రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఎం.ఎస్.నారాయణ పాల్గొన్నప్పుడు, ఆయన హావ భావ ప్రదర్శనకి రవిరాజా పినిశెట్టి బాగా ఇంప్రెస్ అయ్యారు. అలా హాస్యనటుడిగా మోహన్ బాబు నటించిన ఎమ్.ధర్మరాజు ఎం.ఏ. సినిమాలో అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత పుణ్యభూమి నా దేశం, రుక్మిణి (సినిమా) చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. కానీ 1997లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన మా నాన్నకు పెళ్ళి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది.

ఆయన కళ్లకింద ఉన్న ముడతలు చూసి క్యారీ బ్యాగులేమిటీ అని సరదా డైలాగ్ కూడా రాశారు. అంతేకాదు ఆయన చేసిన తాగుబోతు పాత్రల వల్ల స్క్రీన్ మీద నిజంగానే తాగి నటిస్తాడని ప్రచారం చేశారు. కానీ స్వతాహాగా ఎం.ఎస్.నారాయణ లెక్చరర్. ఆయనకి సరస్వతీ దేవి అంటే అపారమైన భక్తీ, ఇష్టం. అందుకే మొహానికి మేకప్ వేసుకున్నాక తాగుబోతు పాత్రలో నటించడానికి రెడీ కానీ, తాగి నటించడానికి మాత్రం అసలు ఒప్పుకోరు. అయితే ఓసారి ఎం.ఎస్.నారాయణ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఇదే ప్రస్తావించాడట. మీరు తాగి నటిస్తారా అని అడిగితే లేదయ్యా అని ఎం.ఎస్.నారాయణ సమాధానం ఇచ్చారు. కానీ మీ పాత్రలు చూసి నేను మాత్రం తెగ తాగేస్తున్నానని అన్నాడట. దాంతో నేను సొసైటీకి నష్టం చేశానా.. చేస్తున్నానా అని ఆలోచించి కొన్ని సందర్భాలలో ఫీలయ్యానని ఎం.ఎస్. నారాయణ చెప్పుకొచ్చారు.
































