జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ అన్నారు.

50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.































