టాలీవుడ్ లో పెరిగిన రీమేక్ ల హవా !!

0
263

అరువు కధలు, టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ రీమేక్ సినిమాల హడావిడే.. చిన్న హీరోల దగ్గర నుంచి, టాప్ స్టార్స్ వరకు అందరు రీమేక్ లనే నమ్ముకుంటున్నారు. ఒక భాషలో అద్భుత విజయం సాధించిన కథను వేరే భాషలో తీయడం కొత్తేమీ కాదు. అనాది కాలం నుంచి ఈ అరువు కధల హంగామా ఉంది. ఈ కోవలో ఎన్నో తెలుగు సినిమాలు హిందీలోను, హిందీలో హిట్ అయినా సినిమాలు తెలుగులోనూ, తమిళంలో కూడా రీమేక్ లు చేసిన సినిమాల లిస్ట్ చుస్తే కోకొల్లలు. సినిమా తీసే సమయంలో కథను ప్రధానంగా తీసుకున్నప్పటికీ ప్రాంతానికి తగ్గట్టుగా అందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ తీయడం ఎప్పటినుంచో వింటున్నదే. మినిమం గారెంటీ కి ఢోకా ఉండదన్న ఆలోచనతోనే నిర్మాతలు ఈ రీమేక్ కధలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో తెలుగు ఎన్నో రీమేక్ సినిమాలు వచ్చాయి అందులో భారీ విజయం సంధించినవి ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఉన్నాయి. సినిమా కొత్త కథతో, విభిన్నంగా ఉండి, బాగుంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. నచ్చక పొతే మాత్రం నిర్మొహమాటంగా తిప్పికొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎంత పెద్ద స్టార్ లు అయినా ఈ విషయంలో మినహాయిపు లేదు. దేనితో దర్శకులే కాదు, హీరోలు కూడా కధలను అన్వేషించడం మొదలుపెట్టారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రధానంగా రీమేక్ అవుతున్న సినిమాలు నాలుగు గురించి చెప్పుకోవాలి అందులో మొదటిది

“జాను” :

హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. 2019 రిలీజ్ అయినా రణరంగం సినిమా తరువాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. ఓ..బేబీ తరువాత సమంత నటించిన చిత్రము ఇదే.. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి నటించి, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగుతున్నారు.

“పింక్” :

చాలా రోజుల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఇంకా టైటిల్ కన్ఫార్మ్ చేయలేదు. “లాయర్ సాబ్” అనే టైటిల్ ఇంకా పరిశీలనలో ఉంది. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నడిచిన “పింక్” చిత్రానికి రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

“రెడ్” :

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం “రెడ్”. “తడమ్ తడమ్” అనే తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ ఈ “రెడ్” సినిమా. “తడమ్ తడమ్” తమిళ నాట భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

“నారప్ప” :

వెంకిమామ సినిమా తరువాత విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం “నారప్ప” ఇది తమిళంలో హీరో ధనుష్ నటించిన “అసురన్” చిత్రానికి రీమేక్. తమిళనాట సంచల విజయం సాధించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. తెలుగులో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” , “బ్రమ్మోత్సవం” వంటి చిత్రాలను తీసిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు.

వీటితో పాటు మరికొన్ని రీమేక్ సినిమాలు 2020 లో విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here