“కరోనా” వైరస్ ప్రపంచాన్ని గజ గజ లాడిస్తుంది. చైనా లో ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఇది మన దేశంలో ప్రవేశించింది. మొన్ననే కేరళలో ఒక వ్యక్తిలో ఈ వైరస్ బయటపడింది. అతనికి తగిన చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ చైనాను వణికిస్తుంది. భారత్ ను భయపెడుతోంది. కొత్త వైరస్ దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి చైనాలో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా నుంచి భారత్, అమెరికా సహా 18 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 9.692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ పరిస్థితిపై నిన్న అత్యవసరంగా సమావేశమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ కమిటీ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని నిర్ణయించింది.

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటారు. నగర రోడ్లపై ఇది తరచూ జరిగే తంతే, అయితే ఇప్పుడు మందుబాబులు హైదరాబాద్ సీపీ ముందు ఓ వినూత్న మరియు విచిత్రమైన డిమాండ్ పెట్టారు మందుబాబులు. కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్లు నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కరోనా అంటువ్యాధి కాబట్టి, దగ్గు, తుమ్ములు, మరియు ఆ వ్యాధి గ్రస్తుడిని తాకడంవల్ల తొందరగా సోకే ప్రమాదం ఉందని, ఒకే బ్రీత్ అనలైజర్ వాడితే తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని సీపీ దృష్టికి తీసుకువచ్చారు.
బ్రీత్ అనలైజర్లు వాడొద్దని కోరుతున్నారు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో బ్రీత్ అనలైజర్లు వాడటం ఏమాత్రం మంచిది కాదని, ప్రజలకే కాకుండా దీనిని వాడుతున్న అధికారుల జీవితాన్ని కూడా పణంగా పెట్టడం ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు మందుబాబులు. కరోనా వైరస్ కి భయంతో మందుబాబులు చేస్తున్న విజ్ఞప్తిని సీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.



























