సినిమా వాళ్ళు అంటే నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు. వారిపై ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్స్, గాసిప్స్ వారిపై వస్తూనే ఉంటాయి. అవన్నీ ఈ మధ్య కాలంలో సర్వ సాధారణమైపోయింది. అప్పట్లో యాక్టర్స్ దీనిపై చాలా గుర్రుగా ఉండేవారు కానీ ఇప్పటి తరం నటీ నటులకు మాత్రం ఇది ఒక పబ్లిసిటీ స్టన్ట్ గా మారిపోయింది. ఎన్ని గాసిప్స్ వస్తే అంతగా జనాలలో అంత గురింపు వస్తుంది అన్నటుగా ఉన్నారు నేటితరం నటీనటులు.

అది ఆలా ఉంటె తాజాగా హీరో శర్వానంద్, సమంత జంటగా “జాను” సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబెల్ బ్యాచులర్ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు శర్వానంద్. అయితే ఇప్పటి వరకు శర్వానంద్ మీద ఒక్క గాస్సిప్ గాని, రూమర్ గాని రాలేదట ఈ విషయం చెప్పింది ఎవరో కాదు అక్కినేని వారి కోడలు సమంత. నిజమండీ బాబు ఈ విషయాన్నీ సమంత గూగుల్ చేసి మరి చెప్పిందట.

శర్వా పై రూమర్స్ కోసం గూగుల్ మొత్తం వెతికిందట. ఒక్క గాస్సిప్ అయినా దొరుకుతుందేమో అని చాలా ఆత్రంగా గూగుల్ ని జల్లెడ పట్టిందట ఈ ముద్దుగుమ్మ. ఎంత వెతికిన శర్వానంద్ మీద ఒక్క లవ్ అఫైర్ గురించిన చిన్న ఆర్టికల్ కూడా దొరకలేదని చెబుతుంది జాను సమంత. ఇక శర్వానంద్ మాత్రం “మజిలీ” సినిమాలో సమంత ను చూసి అటువంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను అని చెబుతున్నాడు. ఇప్పటికే శర్వానంద్ స్నేహితులైన నితిన్, నిఖిల్ ఈ ఏడాది పెళ్ళి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here