తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం దూళ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ని ప్రేమించాడు, అయితే ఆ యువతికి కుటుంబ సభ్యులు వేరే అబ్బాయి తో పెళ్లి చేసారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేసారు అన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాధమిక సమాచారం.
మంగళవారం అర్ధ రాత్రి శ్రీను నేరుగా యువతి ఉంటున్న ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. వెంటనే ఇంటికి మంటలు వ్యాపించడంతో, ఇంటి లోపల ఆరుగురు చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు యువకుడు (రాము), నాలుగేళ్ళ చిన్నారి (విజయలక్షి) అక్కడే సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.