తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు..!

0
651

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎవరనేది ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు నియామకం జరిగింది. ఈమేరకు నర్సింహులను టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల ఎల్‌. రమణ ఆ పదవికి రాజీనామా చేయగా.. కొత్తగా నరసింహులును నియమించారు.

అయితే మొదటి నుంచి జాబితాలో ముందున్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై ఆశక్తిగా లేరని, వ్యక్తిగత కారణాలతో పదవి స్వీకరించడానికి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బక్కని నరసింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here