టాలీవుడ్, కోలీవుడ్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా చెక్కు చెదరని అందంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోంది. “బాహుబలి” సినిమా తరువాత ఆమె స్టేటస్ మరింత పెరిగింది. బాహుబలి తరువాత ఆమె “బాగమతి” అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటున్న అనుష్క ప్రస్తుతం “కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్” మీద కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నిశ్శబ్దం” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క తో పటు మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తీ చేసుకునే పనిలో ఉంది.

ఇదిలా ఉంటే అనుష్క కొన్ని విషయాలలో మోసపోయిందట. ఆమె ఆస్తికి సంబందించిన వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించకుండా నష్టపోయిందట. తెలంగాణ రావడానికి ముందు అనుష్క హైదరాబాద్ లో 5 కోట్లు పెట్టి 4 ఫ్లాట్స్ కొన్నదట. కానీ తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న నమ్మకంతో వాటిని అమ్మేసిందట. కానీ అలా జరగకపోవంతో ఆ ఫ్లాట్స్ విలువ ఇప్పుడు 10 కోట్ల వరకు ఉందట. అలాగే ఆంద్రప్రదేశ్ లోని వైజాగ్ లో భూములు కొన్నదట. కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ని డెవలప్ చేస్తున్నాడని తెలిసి వాటిలో 80% భూములను అమ్మేసిందట. ఇప్పుడేమో వైజాగ్ ని రాజధాని చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉండటంతో అక్కడ భూములకు బాగా డిమాండ్ వచ్చింది.

సినిమాల్లో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలని ఆర్థిక పరిజ్ఞానం ఎక్కువ లేనట్టుంది. మరి ఇకముందు అయినా అటువంటి విషయాలలో అందరి మాటలు వినకుండా జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటుందా అనేది వేచి చూడాలి. కమర్షియల్ సినిమాలలో విజయాలు సాధిస్తూనే, లేడి ఓరియెంటెడ్ చిత్రాలలోనూ అనుష్క నటిస్తూ వచ్చింది. ఈ పదేళ్లలో అనుష్క ఏమి సంపాదించింది, తన ఆస్తులెంత అనే గణాంకాలు ఇటీవలే బయటకీ వచ్చాయి. స్వీటీ కి దాదాపుగా 142 కోట్ల ఆస్తులున్నాయని ఓ అంచనా. హైదరాబాద్, బెంగళూర్, మంగళూరు, వైజాగ్ తదితర చోట్ల స్థిరాస్తులు కొనుగోలు చేసిందట. అనుష్క ఇటీవల ఒక ఇల్లు కొనుగోలు చేసింది. దాని విలువ 12 కోట్లని తేలింది. కార్లు, ఆభరణాలు కలుపుకుంటే దాదాపు 10 కోట్ల వరకు ఉంటాయట. తన సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది స్వీటీ. కొంత మందికి ఇల్లు కొనిచ్చిందట. తన డ్రైవర్ పుట్టినరోజుకి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిందట. అందుకే స్వీటీ సిబ్బంది కూడా ఆమె దగ్గర నమ్మకంగా పని చేస్తుంటారు. టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన కథానాయికాల్లో అనుష్క మొదటి స్థానంలో ఉండటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here