నగ్మాకి,రేసుగుర్రం విలన్ కు మధ్య ఇంత కథ నడిచిందా!

0
1030

నగ్మాకి రేసుగర్రం విలన్ కి మధ్య అంత కథ నడిచిందా….?
నగ్మా.. నిన్నటి తరం అందాల హీరోయిన్ . అరేబియన్ గుర్రమంటి చిన్నది, నగుమోము నగ్మా నగిషీల మహిమ.. అంటూ ఆమెమీద రకరకాల పాటలొచ్చేవి అప్పట్లో. బాఘీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె… పెద్దింటి అల్లుడు తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో టాలీవుడ్ లో అందరూ టాప్ హీరోల సరసన జతకట్టిన క్రేజీ హీరోయిన్ ఆమె. పొడవైన శరీరంతో, పొందికైన అంగసౌష్ఠవంతో, కొంటెనవ్వుతో , చిలిపి చూపులతో అప్పటి యూత్ ను భలే ఎట్రాక్ట్ చేసింది ఆమె. అందుకే ఆమె అందానికి అవతల అరవ దేశం కూడా అచ్చెరువొందింది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగా.. పలువురు ప్రముఖులతో ఆమె ఎఫైర్స్ కొనసాగేవి. ముఖ్యంగా ఆ టైమ్ లో ఇండియన్ కెప్టెన్ సౌరభ్ గంగూలితో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరిగేదన్నది బహిరంగ రహస్యం. ఆ తర్వాత ఆమె పీకలోతుల్లో ప్రేమలో మునిగింది రవికిషన్ అనే భోజ్ పురి సూపర్ స్టార్ తో . రవికిషన్ అంటే బన్నీ రేసుగుర్రంలో శివారెడ్డిగా నటించిన విలన్ పాత్రధారి .
1996లో తెలుగులో వచ్చిన సరదారాముడు , సూర్యపుత్రులు సినిమాలతోనే నగ్మా కెరీర్ ముగిసింది. ఆ తర్వాత 2004 లో యన్టీఆర్ అల్లరి రాముడులో ఆర్తి అగర్వాల్ కు తల్లిగా నటించింది నగ్మా. ఇక ఆ తర్వాత ఆమె తెలుగు లో నటించలేదు. అక్కడనుంచి 2005 లో భోజ్ పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ 2007 వరుకూ వరస సినిమాలు చేసింది. ఆ టైమ్ లోనే అక్కడ సూపర్ స్టారైన రవికిషన్ తో ప్రేమలో పడింది. విచిత్రమేంటంటే ఆ టైమ్ లోనే అతడికి పెళ్ళైంది. పెళ్లైనా సరే నగ్మాతో ఎఫైర్స్ సాగించేవాడు. అంతేకాదు అతడి భార్యతో నగ్మా నా ప్రాణమని కూడా చెప్పేసాడట. అతడి భార్యకూడా దీనికి సమ్మతించిందట. నగ్మా తండ్రి రవికిషన్ కి మంచి ఫ్రెండ్ కావడంతో నగ్మాతో అతడికి మంచి చనువు ఏర్పడి, అది ప్రేమగా మారింది. వీళ్లిద్దరి ఎఫైర్ గురించి భోజ్ పురి ప్రేక్షకులకు బాగా తెలుసు. అలా వాళ్లిద్దరి ఎఫైర్ నగ్మా భోజ్ పురి ఇండస్ట్రీ విడిచిపెట్టే వరుకూ కొనసాగింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగపెట్టడంతో ఆ బంధం అక్కడితో ఆగింది. మరిప్పుడు ఇద్దరి మద్యా రిలేషన్ షిప్ ఉందో లేదో తెలియదు కానీ, రవికిషన్ మాత్రం నగ్మాని ఇప్పటికీ మరిచిపోలేనని చెబుతూ ఉంటడం విశేషం.