బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ నిన్న మరణించిన విషయం తెలిసిందే.. అయితే ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానా కి చెందినా బీజేపీ నేత కూడా బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరణానికి సంతాపం తెలుపుతూ ఒక ట్వీట్ చేసారు. ఇప్పుడు అదే వివాదాస్పదంగా మారింది. ఆ ట్వీట్ లో.. హిందూ పేరు పెట్టుకుని సినీ పరిశ్రమలో రాణించిన ముస్లిం దిలీప్ కుమార్ అంటూ పేర్కొన్నాడు. అయితే దేశం గర్వించదగ్గ నటుడిపై బీజేపీ నేత చేసిన ట్వీట్ పై మండిపడుతున్నారు బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్.

నటుడు దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్.. అయితే కెరీర్ మొదట్లో.. కొందరు సినీ పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అయన స్క్రీన్ నేమ్ దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. హర్యానా రాష్ట్ర బీజేపీ ఐటీ వింగ్ హెడ్ అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. ”దిలీప్ కుమార్ అనే హిందూ పేరుతో సినీ ప్రపంచంలో ఎదిగి డబ్బులు సంపాదించిన యూసుఫ్ ఖాన్ మరణం, చిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
फिल्मी जगत में हिन्दू नाम रखकर पैसा कमाने वाले मोहम्मद यूसुफ खान ( दिलीप कुमार ) का निधन भारतीय फिल्म जगत के लिए अपूरणीय क्षति है!
— Arun Yadav (@beingarun28) July 7, 2021
शोक संतप्त परिवार के प्रति गहन संवेदना!
दिवंगत आत्मा को शांति दे भगवान।
भावभीनी श्रद्धांजलि!
ఇక ఈ ట్వీట్ దిలీప్ కుమార్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉండటంతో.. దీనిపై హీరోయిన్ ఊర్మిళ మండిపడ్డారు. ‘అసలు నీకు సిగ్గు లేదా..’ అంటూ అరుణ్ యాదవ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఊర్మిళ అధికార శివసేన పార్టీ లీడర్ గా కొనసాగుతున్నారు.


































