తెలుగు చిత్ర పరిశ్రమలో రంగనాథ్ గొప్ప నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి రాకముందు రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. అయితే రంగనాథ్ ఫ్యామిలీలో ఎవరికీ సినీ నేపథ్యం లేదు. కానీ ఆయన అక్కినేని నాగేశ్వరరావుకి అభిమాని. ఆయన సినిమాలలో బాగా గమనించేది రియాక్షన్స్. నాగేశ్వరరావుగారు డైలాగ్స్ కి రియాక్షన్స్ అద్భుతంగా ఇస్తారు. నాకు అది కూడా ఒక ప్రేరణ అని రంగనాథ్ చెప్పారు.

కాగా రంగనాథ్ 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత 1974లో చందన అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా రంగనాథ్ కి మంచి పేరు తెచ్చినప్పటికి కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్యతులు తనమీదే ఉండటంతో సినిమాలను కాదని ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. బిఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వచ్చింది. అలా కొంతకాలం సినిమాలకి దూరమై రైల్వేలో టిసిగా ఉద్యోగం చేశారు.

అయితే బాపుగారు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాలో రాముడి పాత్రతో పాటు, ‘చందన’ సినిమాలో హీరోగానూ ఒకేసారి అవకాశాలు వచ్చాయి. కానీ బాపుగారి సలహా మేరకు చందన సినిమాను ఒప్పుకున్నారు. అలా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రంగనాథ్ ‘పంతులమ్మ’ అనే సినిమాతో స్టార్ హీరో అయ్యారు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన రంగనాథ్ కి కెరీర్ ప్రారంభంలోనే పోటీ ఎక్కువై ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో చేసేదేమీ లేక హీరో అవకాశాలు కాకపోయినా వచ్చిన పాత్రలను చేసి గుర్తింపు తెచ్చుకోవాలనే కారణంతో ‘గువ్వల జంట’ సినిమాతో మొదటిసారి విలన్ పాత్రలో నటించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు.

ఇలా కెరీర్ ప్రారంభంలోనే హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రంగనాథ్ ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరని ఇండస్ట్రీలో చెప్పుకునేలా తన సత్తా చాటారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, శోబన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, గిరిబాబు, ఎస్వీ రంగారావు, చంద్ర మోహన్, చిరంజీవి..లాంటి స్టార్ హీరోలతో కలిసి అన్నీ రకాల పాత్రల్లో నటించారు. వీరితో సినిమాలు చేసిన రంగనాథ్ అందరితో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. రంగనాథ్ నటుడే కాదు మంచి రచయిత కూడా. అప్పట్లోనే రచయిత అందుబాటులో లేకపోతే కొన్ని సన్నివేశాలకి డైలాగ్స్ కూడా రాశారు. సినీ ప్రముఖుల మీద కవితలు రాశారు.

అయితే రంగనాథ్ మొదటి సినిమా తర్వాత ఒకేసారి తన మీద కుటుంబ బాధ్యతలు, ఇండస్ట్రీలో పోటీ ఎదురయ్యాయి. వీటిని తట్టుకోలేకనే కుటుంబ పోషణకొసం డబ్బు అవసరమై ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అయినా తనకి నటన మీద ఆసక్తి కోరిక మాత్రం చచ్చిపోలేదు. తన తల్లికోరిక మేరకు మాత్రమే కాదు తనకి ఇండస్ట్రీలో నటుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని కసి ఉండేది. అదే ఆయనని కాంప్రమైజ్ కాకుండా చేసింది. దాంతో మళ్ళీ సినిమాలు చేసి స్టార్ గా మారాడు. ఈ క్రమంలో మొగుడ్స్ – పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గడంతో కొన్ని టీవీ సీరియల్స్ లో నటించారు. ఆయన రాసిన కథలు, కవిత్వాలు పుస్తకాలుగా ప్రింట్ అయ్యాయి.

దాదాపు 300 చిత్రాలకుపైగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న రంగనాథ్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో అయన ఆత్మహత్యకు పాల్పడి చనిపోయారు. అయితే ఆయన ఆత్మహత్య తీరు అందర్ని చాలా బాధపెట్టింది. ఇక రంగనాథ్ చనిపోతూ అయన ఇంట్లో పని చేసే మీనాక్షీ అనే అమ్మాయికి ఐదు లక్షల రూపాయిలు ఇవ్వండి అని బొగ్గుతో తన ఇంటి గోడమీద రాసిపెట్టారు రంగనాథ్ గారు. చనిపోయే ముందు వరకూ ఆయనకోసం పని చేసిన వ్యక్తి ఋణం ఉంచుకోకూడదు అనే ఉద్దేశ్యంతో చనిపోయే ముందు అయన అలా రాసినట్టు తెలుస్తుంది.


































