అక్కనేని అమల. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సతీమణి. ఆయన మనసు కొల్లగొట్టిన అందాల తార. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి జనాల మనసులు దోచి హీరోయిన్. ఎక్కడో విదేశాల్లో పెరిగి ఇక్కడే ఎక్కవ సినిమాలు చేసి ఇక్కడి అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ నటీమణి. ఇంతకీ నాగార్జునతో అమలకు ఎక్కడ పరిచయం ఏర్పడింది.? వీరి పెళ్లి? ఎలా జరిగింది.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అమల 1968 సెప్టెంబర్ 12న కోల్ కతాలో పుట్టింది. తన తండ్రి ముఖర్జీ బెంగాలీ వ్యక్తి. నేవీ ఆఫీసర్ గా పనిచేశాడు. తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. అమల చిన్నతనం అంత కూడా విదేశాల్లోనే సాగింది. కొన్నాళ్ళకు ఇండియా కి వచ్చారు. ఇక అమల తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అమల తండ్రి ఖరగ్ పూర్ లో ప్రొఫెసర్ గా పని చేసాడు. అమల తల్లి హాస్పిటల్ మేనేజ్మెంట్ లో పని చేసింది.

అందుకే అమల పేరెంట్స్ వైజాగ్, చెన్నై సహా పలు ప్రాంతాలలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో సినిమాల వైపు మొగ్గు చూపింది అమల. చిన్నతనం నుండో నృత్యం నేర్చుకున్న అమల అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఇక టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన మిథిలి ఎన్నై కాథాలి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొత్తం తన కెరీర్ లో 54 సినిమాలు చేసింది. ఇందులో ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

కిరాయి దాదా సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది అమల. ఆ తర్వాత చినబాబు, రక్త తిలకం, శివ, ప్రేమయుద్ధం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం సహా పలు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేసింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

తెలుగులోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే నాగార్జున, అమలపై మనసు పారేసుకున్నాడు. ముందుగా నాగార్జునే ప్రపోజ్ చేసారట. కాకపోతే తనకు ప్రపోజ్ చేయడానికి 5 ఏళ్లు వెయిట్ చేశారట. ఆ సమయంలో నాగార్జున ప్రపోజ్ చేయగానే.. అమల బోరున ఏడ్చేసిందట. ఆ తర్వాత తను కూడా ఒప్పుకుందట. నిర్ణయం సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది అమల. 1992లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి తర్వాత అమల నాగార్జునలకు అఖిల్ జన్మించాడు.



































