నిన్న హీరో లతో రొమాన్స్ చేసి ఈ రోజు వారికే తల్లి గా మారారు..

0
1106

ఆ హీరోలకు భార్యలు గానూ హిట్టయ్యారు…వాళ్లకే తల్లులుగానూ హిట్టయ్యారు
టాలీవుడ్ లో కొన్ని విచిత్రాలు జరుగుతుండడం క్వైట్ కామన్. ట్రెండీ గా వెళుతున్న ఇప్పటి సినిమాల్లో కాకుండా ,మూసగా పయనిస్తుండే అప్పటికాలంలోనే ఇలాంటివి చాలా సహజంగా జరిగిపోయేవి. అప్పటి టాప్ హీరోల సరసన నటించిన కొంత మంది హీరోయిన్స్ , వాళ్లకి భార్యలు గా నటించి మంచి క్రేజ్ కొట్టేసారు. వాళ్లే కాస్త పాతపడ్డ తర్వాత అదే హీరోలకు తల్లులుగానూ నటించి అప్పడూ హిట్టయ్యారు. అలాంటి వాళ్ల లిస్ట్ తీస్తే అలాంటి హీరోయిన్స్ బాగానే కనిపిస్తారు.
సీనియర్ యన్టీఆర్ నే తీసుకుంటే ఆయన సరసన సత్యహరిశ్చంద్ర, బబ్రువాహన, మహామంత్రి తిమ్మరుసు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన యస్.వరలక్ష్మి తర్వాత కాలంలో యన్టీఆర్ కే అగ్గిరవ్వ, కలియుగరాముడు, ప్రేమ సింహాసనం, వయ్యారి భామలు వగలమారి భర్తలు లాంటి సినిమాల్లో తల్లిగా నటించింది. ఆ తర్వాత భానుమతి కూడా యన్టీఆర్ సరసన తోడు నీడ, మల్లీశ్వరి సినిమాల్లో హీరోయిన్ గా నటించి, తర్వాత కాలంలో సామ్రాట్ అశోక లో యన్టీఆర్ కు తల్లిగా నటించింది. ఇక ఎఎన్నార్ విషయానికొస్తే ఎఎన్నార్ తో సువర్ణసుందరి,భక్తతుకారాం లాంటి సూపర్ హిట్టు సినిమాల్లో భార్యగా నటించిన అంజలీ దేవి తర్వాత కాలంలో ఎఎన్నార్ కు తల్లిగానూ నటించింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ విషయానికొస్తే ఆయన సరసన ఇంద్రధనుసు ,ఆడంబరాలు అనుబంధాలు, రాధమ్మపెళ్లి లాంటి హిట్టు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శారద ఆ తర్వాత అగ్నికెరటాలు, అగ్నిపర్వతం, రౌడీనెం. 1, లాంటి సినిమాల్లో కృష్ణకే తల్లిగా నటించింది.
తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు సరసన కూడా అభిమానవంతులు, చట్టంతో చెలగాటం, శివమెత్తిన సత్యం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శారద ఆయనకే తల్లిగా రారాజు నటించింది.
ఇక శోభన్ బాబు కు భార్యగా చదువుకున్న అమ్మాయిల్లో హీరోయిన్ గా నటించిన సావిత్రి , ఆమె చివరి దశలో గోరింటాకులో శోభన్ బాబు కు తల్లిగా నటించింది. తర్వాత మోహన్ బాబు మొదటి సినిమా స్వర్గం నరకం సినిమాలో హీరోయిన్ గా నటించిన అన్నపూర్ణ, తర్వాత కాలంలో అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలో మోహన్ బాబుకే తల్లిగా నటించింది.

సో.. మొత్తానికి ఒకప్పుడు సూపర్ హిట్టు కథానాయికలైన వీళ్ళంతా తర్వాత కాలంలో .. ఆ హీరోలకే తల్లులుగా నటించి చరిత్రకెక్కారు.