తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి అడ్డంకులు ఇటీవలే తొలగిన విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.






























