అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమకథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ ఆ తర్వాత సత్యం అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ అతనికి మాత్రం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

సుమంత్ ఎట్టకేలకు రెండవ సారి పెళ్లి చేసుకోబోతున్నారని, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని తెలుస్తోంది. అయితే సుమంత్ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా పెళ్లి పనులు చేసుకుంటున్నాడని, అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి జరగబోతుందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో సూపర్ వైరల్ గా మారింది. ఇక వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు.

“ఒకసారి పెళ్లి చేసుకున్నాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? సుమంత్.? నీ కర్మ, ఆ పవిత్ర కర్మ. అనుభవించండి అంటూ తనదనైన శైలిలో చురకలు అంటించారు వర్మ. అయితే తాజగా వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ సుమంత్ పెళ్లికి గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా వర్మ ఘాటుగా స్పందించడం విశేషం.
Oka saari ayyaka kooda neekinkaa buddhi raaledha @iSumanth ? Nee kharma , aa pavitra kharma???? Anubhavinchandi ???? pic.twitter.com/cfg2Zs5npg
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021

ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే దాదాపు15 ఏళ్ల క్రితం తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.ఈ విధంగా వీరిద్దరు విడిపోవడంతో కీర్తి రెడ్డి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని తన జీవితంలో సెటిల్ అయిపోయారు. సుమంత్ మాత్రం 15 సంవత్సరాల నుంచి ఒంటరిగానే గడుపుతున్నారు. తనని మరో పెళ్లి చేసుకొమ్మని కుటుంబం సభ్యులు చెబితే సరైన వ్యక్తి దొరికితే చూద్దాం అనేవాడే కానీ దొరుకుతుందనే నమ్మకం అతనికి లేదని చెప్పేవాడు.






























