నీకు త‌మ్ముడిగా పుట్ట‌డం నాకు పెద్ద శాపం అన్న అలీ త‌మ్ముడు ఖయ్యూం.!! (వీడియో)

0
1009

తెలుగు సినిమారంగంలో కమెడియన్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు ఆలీ..చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగ ప్రవేశం చేసిన ఆలీ మొదటి నుండి కమెడియన్ గా 1000కి పైగా చిత్రాల్లో నటించారు.అన్ని చిత్రాల్లో కూడా కామెడి తరహా పాత్రలకే ప్రాధాన్యతనిచ్చారు..ఆలీ కమెడియన్ అవ్వడమే తన సినిమా కెరీర్ కి మైనస్ అయిందని బాద పడ్డారు ఆలీ బ్రదర్ ఖయ్యూం.. సినిమాలతో పాటు ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం చేస్తున్నారు ఆలీ..

ఆ ప్రోగ్రాం కి శివారెడ్డి అతిధిగా వచ్చారు.శివారెడ్డితో పాటు ఆలీ బ్రదర్ ఖయ్యూం కూడా వచ్చారు..ఆలీ తమ్ముడిగా పుట్టడం నీకు ప్లస్సా ,మైనస్సా అని ఆలి అడిగిన ప్రశ్నకు..ఖయ్యూం ఈ విధంగా స్పందించారు..ఆలి అనగానే కామెడీ అనుకుంటారు.అదే నాకు మైనస్ అయింది.నేను నెగటివ్ రోల్స్ చేయాలనుకున్నా,కానీ ఎవరన్నా ఆలీ బ్రదర్ అనగానే కామెడి రోల్స్ ఇవ్వడం ,నెగటివ్ రోల్స్ చేస్తా అని చెప్పినప్పటికీ తర్వాత పిలుస్తాం అంటూ చాలా సినిమాల్లో అవకాశాలు పోగొట్టుకున్నా..

ఆలీ బ్రదర్ గా కాకుండా ఉండుంటే,ఆ రోల్స్ వచ్చుంటే ఇప్పుడు ఆలీ బ్రదర్ గా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేదని బాదపడ్డారు..సినిమా ఇండస్ట్రీలో అంతే ఒక పాత్ర చేస్తే దానికే పరిమితం చేస్తారు.వారిలో ఉన్న నటనను వాడుకోవడానికి ఎవరో కొందరు ప్రయత్నిస్తారు..కొందరు నటులు మాత్రమే అన్ని రకాల పాత్రలతో మెప్పిస్తారు.ఇంకొందరు మెప్పించగలమనే నమ్మకం వారికున్నా డైరెక్టర్లు,నిర్మాతలు వారికి వైవిధ్యమైన పాత్రలిచ్చి ధైర్యం చేయలేరు..ఖయ్యూం కూడా ఆ కోవకే చెందినవాడు..