నేను బాగానే ఉన్నాను. డిస్కోరాజా చూసి ఎంజాయ్ చేయండి.

0
487

“కమెడియన్ సునీల్ ఆసుపత్రి పాలయ్యారు” అనే వార్త దావాళంలా వ్యాపించింది. సోషల్ మీడియా లో వైరలై కూర్చుంది. దీనికి తోడు సునీల్ కు తీవ్ర అస్వస్థత అని కొన్ని మీడియాలో వార్తలు రావడంతో అయన ఫ్యాన్స్ నిజంగానే కంగారు పడ్డారు. అయితే నిజానికి సునీల్ గత కొద్దీ రోజులుగా లివర్ కి సంబందించిన చాలా చిన్న సమస్యతో బాధ పడుతున్నాడు. దానికితోడు ఫీవర్ రావడంతో డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రక రకాలుగా రాసేశారు మాష్టారు..

అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు సునీల్. దానికి సంబందించి ఒక పోస్ట్ కుడా ఫేస్బుక్ లో పెట్టాడు. “నా గురించి ఇంతగా ఆలోచించినా నా శ్రేయోభిలాషులందరికీ.. థాంక్స్.. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను.. డిస్కోరాజా థియేటర్స్ లోకి వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి” అంటూ పోస్ట్ చేసాడు. ఏది ఏమయినా సునీల్ బాగానే ఉన్నాడు, కానీ పూర్తి వివరాలు తెలియకుండా లేనిపోనివి రాసి సునీల్ అభిమానులను కంగారు పెట్టించారు.