స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో “జులాయి” తరువాత వస్తున్న చిత్రం ” అలా వైకుంఠపురంలో ” క్రేజీ కాంబినేషలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ కమిడియన్ సునీల్ చాలా రోజుల తరువాత బన్నీతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈనెల 12న (ఆదివారం) ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ మధ్యే లైవ్ కాన్సర్ట్ కూడా నిర్వహించారు. తాజాగా చిత్ర మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది.

అయితే షూటింగ్ సమయంలో సెట్ కి వచ్చిన బన్నీ కొడుకు అయాన్ ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్ అని అనడంతో ఈ వీడియో ఆసాంతం బన్నీ, త్రివిక్రంతో సహా చిత్రబృందం నవ్వులే దర్శనమిస్తున్నాయి. నవ్వులతో దద్దరిల్లిన వీడియో మేకింగ్ ని చుస్తే థియేటర్ లో నవ్వులు పేలడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాతి బరిలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఆదివారం విడుదల కానుంది. మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” దీనికన్నా ఒక్క రోజు ముందుగా శనివారం విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here