ఏ మాత్రం కనికరం లేకుండా రాక్షసత్వంగా ఆ యువకుడు ప్రవర్తించాడు. కుక్కను పట్టుకున్న ఓ యువకుడు మొసళ్ళు ఉన్న చెరువులోకి వాటిని విసిరేశారు. అతడు ఆ కుక్కను నీటిలోకి విసిరిన క్షణాల్లోనే మొసలి వచ్చి ఆ కుక్కను కరకరా నమిలేసింది.

ఓ చిన్న కుక్కను మెడ పట్టుకొని తీసుకొని వచ్చిన ఓ కుర్రాడు.. దాన్ని తీసుకొని నీటిలోకి విసిరేశాడు. అక్కడే భోజనానికి కూర్చున్న మొసలి క్షణాల్లో దాన్ని మింగేసింది. ఈ ఘటనను ఆ యువకుడి స్నేహితులు వీడియోను కూడా తీశారు. ముప్పై ఆరు సెకెండ్ల వీడియోలో బ్రతికి ఉన్న కుక్క నీళ్ళలో కొట్టుకుంటూ ఉంటే.. ఓ పెద్ద మొసలి వచ్చి దాన్ని మింగేసింది. దీన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఆ వ్యక్తులలో మానవత్వం మంటగలిసిందని.. నిస్సహాయురాలైన ఆ కుక్క పిల్లను అన్యాయంగా చంపేశారని కామెంట్లు చేస్తున్నారు జంతు ప్రియులు. అయితే ఈ పనికి పాల్పడ్డ వారెవరో ఇంకా తెలియరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here