పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ రెండు రోజుల కలెక్షన్స్

0
434

పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ కలిసి సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలు. హీరోగా యుంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ మరియు కొత్త భామ నభా నటేష్ నటించిన విషయం తెలిసిందే.. అయితే జులై 18 వ తేదీన విడుదలైన ఈ చిత్రం తోలి రోజునుంచి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.

అయితే ఎప్పటిలానే పూరి మార్క్ డైలాగ్స్ మరియు హీరో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్, మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 7.8 కోట్ల రూపాయలు రాబట్టిందని ఈవిషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. తొలి రెండు రోజుల్లోగా మొత్తంగా 25 కోట్ల రూపాయిలు వసూలు చేసిందని అంటున్నారు చిత్ర నిర్మాత ఛార్మి. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా వసూళ్ల పరంగా ఈ సినిమా మరింత పుంజుకునే అవకాశాలున్నాయని, తోలి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రాబట్టవచ్చని అంచనాకి వస్తున్నారు ట్రేడ్ పండితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here