Connect with us

Movie News

పూరి మొదటి హీరోయిన్ కానీ మన తెలుగు సీరియల్స్ లో బామ్మ గా చాలా పాపులర్

Published

on

పూరి మొదటి హీరోయిన్ కానీ మన తెలుగు సీరియల్స్ లో బామ్మ గా చాలా పాపులర్..

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: పెట్రో బాంబులు వేసి సరస్వతి భూములను లాక్కున్నారు: పవన్ కళ్యాణ్

Published

on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ ఆస్తులకు సంబంధించిన వాటిలో సరస్వతి పవర్ భూములు కూడా ఒకటి. ఈ భూమి గురించి వైయస్ జగన్ షర్మిల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.

Advertisement

తాజాగా పలనాడు జిల్లాలో ఉన్నటువంటి సరస్వతి భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతీ పవర్ భూములను వైయస్ హయామంలో ఉన్నప్పుడు ప్రజల వద్ద నుంచి సేకరించారని తెలిపారు. ఆ సమయంలో తమ భూములను కంపెనీ కోసం ఇస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వైఎస్ భూములను తీసుకున్నారు.

తమ భూములను ఇవ్వని రైతులపై పెట్రో బాంబులు వేసి మరి బెదిరించి భూములను లాక్కున్నారని పవన్ తెలిపారు. ఇలా కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడమే కాకుండా సుమారు 300 ఎకరాల అటవీ భూములను కూడా ఆక్రమించారని వాటన్నింటినీ కూడా తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.

రైతులకు న్యాయం చేయలేదు..
ఇలా ప్రజల వద్ద భూములను లాక్కొని ఇప్పటికి వారికి న్యాయం చేయలేదని, ఈ ఆస్తి కోసమే ఆ అన్న చెల్లెలు కొట్టుకుంటున్నారని పవన్ తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఇంకా ఎన్ని దోపిడీలు జరిగేవో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీని అడ్డుకున్నామని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Suriya: బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య… ఎందుకంటే?

Published

on

Suriya: సినీ నటుడు సూర్య కంగువ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సూర్యను వేదికపైకి ఆహ్వానిస్తూ నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ సూర్యకు అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు.

Advertisement

బాలయ్య ఆ తర్వాత సూర్యతో సరదా మాట్లాడుతూ తికమక పెట్టే ప్రశ్నలు అడిగారు అనంతరం తన తమ్ముడు కార్తీ ఫోన్ నెంబర్ ను తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారో అడిగారు అలాగే తన తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడారు. మీ అన్న ఇక్కడ అన్ని అబద్ధాలే చెబుతున్నారని చెప్పగా చిన్నప్పటినుంచి అంతే అంటూ కార్తి సెటైర్లు వేశారు. అలాగే ఓ నటి అంటే ఆయనకు చాలా ఇష్టం సార్ అని కార్తీ అంటే.. వెంటనే సూర్య నువ్వు కార్తీ కాదు రా.. కత్తి అని డైలాగ్ వేశారు.

ఇక సూర్య నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈయన తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులని చదివించారు అయితే ఓ అమ్మాయి వీడియోని ఇక్కడ ప్లే చేయడంతో తను చెప్పిన మాటలకు సూర్య ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య గారి వల్ల తాను చదువుకున్నానని అమ్మాయి చెప్పడంతో సూర్య ఎమోషనల్ అయ్యారు.

చారిటబుల్ ట్రస్ట్..
బాలకృష్ణ కూడా నాకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇక తమిళనాడులో చాలా మంది ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే తెలుగు నుంచి కూడా దాదాపు సగంమంది జనాలు ఫండ్ ఇవ్వడాని ముందుకు వచ్చారని సూర్య చెప్పారు. ఇక ఈయన నటిస్తున్న కంగువ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Published

on

Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఇటీవల శివాని అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ నిశ్చితార్థపు వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నిశ్చితార్థంలో దగ్గుబాటి వెంకటేశ్వర బాబు దంపతులు కూడా పాల్గొన్నారు. ఇక నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్వయానా వెంకటేష్ బంధువు అమ్మాయి కావటం విశేషం.

నితిన్ నార్నె పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు శివాని. ఆమె వెంకటేష్ కు బంధువులు అయినా.. తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూప దంపతుల కూతురు. అంటే వెంకటేష్ కజిన్ కూతురు. అంటే అటు ఎన్టీఆర్ కు ఆమె చెల్లెలు వరుస అవుతుంది. ఇలా ఎన్టీఆర్ కు వెంకటేష్ బాబాయ్ వరుస అయ్యాడు. ఇలా ఈ రెండు కుటుంబాలు మధ్య బంధుత్వం ఏర్పడింది.

బంధుత్వం..
వెంకటేష్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటంతో వీరిద్దరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శివాని నితిన్ ఇద్దరిది ప్రేమ వివాహం కావటం విశేషం గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉండడంతో పెద్దలు వీరి వివాహాన్ని జరిపిస్తున్నారు. ఇక ఈ నిశ్చితార్థపు వేడుకలలో భాగంగా వెంకటేష్ ఎన్టీఆర్ పిల్లలతో కలిసి ఎంతో సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!