ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యెక హోదా గురించి తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఈ విషయంలో ప్రస్తుతం మనం కేంద్రాన్ని అడగగలం తప్పితే చేయగలిగింది ఏమీ లేదని జగన్ స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం గురించి అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించామని అయన అన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా గాని.. లేదా వేరే ఏమయినా చేయాలనీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు.. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి శాతం మెజారిటీ ఉంది.. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం అయితే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇంతగా పూర్తి మెజారిటీ ఉన్న ఈసమయంలో కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. అయినా తన బాధ్యతగా కేంద్రాన్ని అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు.






























