“హ్యాపీడేస్” సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్దార్ద్. తన హైపర్ యాక్టివ్ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పుడు తన సినిమాల గురించి అభిమానులతో పంచుకునే నిఖిల్. తన లైఫ్ గురించి చాలా ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

మొన్నామధ్యనే మంచు లక్ష్మి హోస్ట్ చేస్తూన్న ఒక షోలో తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, తన జీవితం లో ఒక అమ్మాయి ఉందని, ఆమె ఒక డాక్టర్ అని, తాను చాలా మంచిది. నన్ను బాగా అర్ధం చేసుకుంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్, అయన ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ కి ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోని డా.పల్లవి వర్మ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరిగిదట. ఈ వేడుకకు ఇరువురి బంధువులు మరియు కొద్దిమంది స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు అయన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ తో పాటు “తను ఎస్ చెప్పిందని, ఇక లైఫ్ లో కొత్త అడ్వెంచర్ మొదలవుతుంది” అంటూ పోస్ట్ చేస్తారు. పోస్ట్ అయితే చేసారు. త్వరలో మరిన్ని అయన పెళ్ళి కి సంబందించిన వివరాలతో మనముందికి రానున్నారట హీరో నిఖిల్.

అయితే ఆయనకి సెలెబ్రెటీలు అయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ అయన పెట్టిన పోస్టుకి రిప్లైలు ఇస్తున్నారు.

Actor Nikhil Engagement
Actor Nikhil & Dr. Pallavi
Actor Nikhil & Dr. Pallavi
Actor Nikhil Engagement
Actor Nikhil & Dr. Pallavi
Actor Nikhil Engagement
Actor Nikhil & Dr. Pallavi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here