అల్లు అర్జున్ ప్రస్తుతం “అలా వైకుంఠపురములో” సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బన్నీ. విదేశాలకు వెళ్లి ఆ తరువాత చేయబోయే సుకుమార్ సినిమా కోసం సన్నద్ధం అవుతున్నడని అనుకున్నారు అంతా. కానీ అల్లు అర్జున్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా వేరే పని బిజీగా చేసుకుపోతున్నాడట. అదేమిటంటే తమిళనాట ఒక సినిమా చేయడంలో బిజీ అయిపోయాడట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా రోజుల క్రితమే ఈ బైలింగ్యువల్ సినిమా మొదలుపెట్టినా ఆ తరువాత ఆ మాట వినిపించకపోవడంతో బన్నీ తమిళ సినిమా ఎంట్రీ వాయిదా పడింది అని అనుకున్నారు.

కానీ తాజాగా బన్నీ లైకా ప్రొడక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, గుట్టు చప్పుడుకాకుండా మురుగదాస్ దర్శకత్వంలో షూటింగ్ మొదలు పెట్టాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. చిన్న న్యూస్ కూడా లేకుండా బన్నీ కోలీవుడ్ సినిమా సెట్స్ మీదికి వెళ్లేసరికి అందరు షాక్ అయ్యారు. అయితే ఈ విషయం కోలీవుడ్ కోడై కూస్తుంది. అయితే ఇంత సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న సినిమా సంగతి దర్బార్ డిస్ట్రిబ్యూటర్స్ బయటకి తీసుకొచ్చారు. వారు గొడవ చేస్తూ లైకా ప్రొడక్షన్స్ ఆఫీసుకి వెళితే, వారంతా బన్నీ సినిమా సెట్స్ వద్ద ఉన్నారని, మురుగదాస్ కూడా అక్కడే ఉన్నాడని న్యూస్ మాత్రం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here