టాలీవుడ్ టాప్ హీరో, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ మొన్న ఈమధ్యనే తన కొత్త లుక్ తో అభిమానులకు షాక్ ఇచ్చారు. వికేంద్రకరణ బిల్లు సమయంలో మండలిలో వైసీపీ నేత రోజాతో తీసుకున్న సెల్ఫీలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఈ విషయం పొలిటికల్ గా పెద్ద దుమారమే రేగింది. ఒక పక్క బిల్లుపై రచ్చ జరుగుతుంటే ఇరుపార్టీల నేతలు ఇలా సెల్ఫీలు తీసుకోవడంపై మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. రాజకీయాలు ఎలా ఉన్నా బాలయ్య లుక్ మాత్రం అదిరిపోయింది. బాలయ్య కొత్త లుక్ కి నందమూరి ఫాన్స్ తెగ ఫిదా అయిపోయారు. అందుకేనేమో వైసీపీ నేతలు కూడా మండలి అని కూడా చూడకుండా బాలయ్యతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు. ఇకపోతే బాలయ్య హఠాత్తుగా ఇలా డిఫరెంట్ లుక్, అదేనండి గుండెలోకి మారిపోవడాన్ని మొక్కేమో అని కొందరు అనుకుంటే, లేదు బోయపాటి సినిమాకోసమే బాలయ్య కొత్త లుక్ అని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉందని ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం. బోయపాటి సినిమాలో బాలయ్య ఒక అఘోరా పాత్ర పోషిస్తున్నది వినికిడి. అందులో అసలు విషయమేమిటో డైరెక్టర్ బోయపాటి గాని, లేకపోతె బాలయ్య గాని బయటకి పొక్కనివ్వడంలేదు. అఘోరా పాత్రలో అభిమానులకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలలో టాక్ మొదలయింది.

బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని తాజా సమాచారం. గుండు గీయించుకున్న తరువాత ఆయనకు జుట్టు ఫుల్లుగా వస్తుందని, నున్నగా ఉండే బాలయ్య గుండుపై ఇప్పుడు పూర్తిస్థాయిలో జుట్టు ప్రేరుగుతుందని టాక్. ప్రతి సినిమాకి రకరకాల విగ్గులతో అభిమానులని కనువిందు చేసే బాలయ్య ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో తన సొంత జుట్టుతో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఎవరో అనుకుంటున్నారని కాదులే గాని అయన లేటెస్ట్ ఫొటోస్ జాగ్రత్తగా గమనిస్తే వారి మాటలు నిజమేనెమో అనిపిస్తుంది. బాలయ్య బట్టతల దాదాపు మాయమై రెగ్యులర్ జుట్టుతో కనిపిస్తున్నారు. ఏది ఏమైనా కొందరు సీనియర్ హీరోలు చేయలేని సాహసం బాలయ్య చేసాడనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here