హీరోయిన్ నయనతార బిగ్ బాంబ్ వేయడమేంటి, అసలు నాయన తార బిగ్ బాస్ లోకి ఎప్పుడు వెళ్ళింది అని ఆలోచిస్తున్నారా? అదేమీలేదండి… నాయనతార బిగ్ బాంబ్ వేసింది బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మీద కాదు. ఫిలిం ఇండస్ట్రీ లో నిర్మాతలమీద. నిజమేనండి బాబు నయనతార వేసిన బిగ్ బాంబ్ కి నిర్మాతలు బెంబేలు ఎత్తుతున్నారట..

నయనతార హవా ఈ రేంజ్ లో కొనసాగుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. తెలుగులో “సైరా”, తమిళంలో “బిగిల్” బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాలు అందుకున్న తరువాత కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి నయన్ కి. ప్రస్తుతం రజనీకాంత్ “దర్బార్” విజయం అందుకోవడంతో అమ్మడి రెమ్యునరేషన్ కి రెక్కలు వచ్చాయట. ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచిందని సమాచారం. ఈ సినిమాలకు 5 కోట్లు వరకు పారితోషకం తీసుకుందని టాక్. తాజాగా దీన్ని 8 కి పెంచేసినట్టు సమాచారం. నయన్ కి ఉన్న క్రేజ్ తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతూ, తమ సినిమాలో నటించమని అడుగుతున్న నిర్మాతలపై నయనతార భారీ పారితోషకం అనే “బిగ్ బాంబ్” వేస్తుందని తెలుస్తోంది. అయితే భారీ పారితోషకం పెంచినా నయనతార తమ సినిమాలో నటించాలని కొందరు దర్శక నిర్మాతలు పట్టుబడుతున్నారట. ఎందుకంటే నయనతార క్రేజ్ ఆలా ఉంది మరి.

ప్రస్తుతం తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ ను నిర్మాతగా చేసి “నెట్రికాన్” అనే తమిళ చిత్రం లో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకి కూడా పచ్చ జెండా ఊపేసింది. ఆర్.కె బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ముక్కుత్తి అమ్మన్ అనే చిత్రం లో ముఖ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతుంది. ఇది భక్తిరస చిత్రం అని ఆర్.కె. బాలాజీ ఇటీవలే వ్యక్తం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఇందులో నయనతార అవకాశం అడిగి మరీ నటిస్తుందట. ప్రస్తుతం తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోడానికి ప్రియుడితో కలిసి న్యూయార్క్ చెక్కేసిన నయనతార తిరిగిరాగానే ముక్కుత్తి అమ్మన్ చిత్రంలో నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here