బ్రాండెడ్ వస్తువులు ఈ చోర్ బజార్లలో ఎంతకు అమ్ముతున్నారో తెలిస్తే..

0
1361

మన దేశంలో రకరకాల మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి అందులో కొన్ని నగరాలలో ఒక వెరైటీ మార్కెట్ లు కూడా ఉన్నాయి అవే చోర్ బజార్ అంటే ఇక్కడ దొంగిలించిన వస్తువులన్నీ తక్కువ ధరకు అమ్ముతారు.అయితే ఇక్కడకు నడిచి వెళ్లి వస్తువులు కొనుక్కొని ఇంటికి వచ్చేంతవరకు జాగ్రత్తగా పట్టుకొని తెచ్చుకోవాలి. అలా కాక బైక్ పైనో కార్లోనో వెళ్లి అది అక్కడ పార్క్ చేసి షాపింగ్ చేసుకొని వచ్చే లోపు వారి స్పేర్ పార్ట్స్ ఊడదీసి మరే అమ్మేసుకుంటారు.ఇలాంటివి దక్షిణ ముంబై లోని మటన్ బజార్ సమీపంలో ఈ చోర్ బజార్ ఉంది ఇక్కడ సూది నుండి కార్ వరకు అన్నే వస్తువులు లభిస్తాయి నాసిరకంగా భవనాలలో ఎప్పుడు కిక్కిరిసి పోయిన జనాలతో రద్దీగా. ఉటుంది ఈ ప్రదేశం .కొంచెం ఓపిక చేసుకుని బ్యారం చేయగలిగితే బ్రాండెడ్ వస్తువులను కూడా చాలా తక్కువ ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ జేబుల్లోనీ పర్సు పోయినా స్త్రీ మెడల్లోని బంగారం పోయిన అడిగే దిక్కే ఉండరు ఎంత జాగ్రత్తగా ఉండాలి.వక్తోరియ రాణి ముంబై వచ్చినప్పుడు తన వస్తువుల్లో పియానోతో పాటు ఇంకొన్ని వస్తువులు పోయాయి.అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వస్తువులు ఈ చోర్ బజార్ లో ప్రత్యక్షమయ్యాయి.

దాదాపు 120 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఛోర్ బజార్ కి ఇక్కడ బజార్ ఉదయం 11 గంటలకు మొదలయ్యి నైట్ వరకు కొనసాగుతుంది.అలాగే శుక్రవారం రోజు సెలవు ఉంటుంది కారణం ఇక్కడ అందరూ ముస్లిం లు ఉంటారు వారు ప్రార్దిచడానికి.అయితే శుక్రవారం వేరే సంత జరుగుతుంది.అలాగే ఢిల్లీ చెన్నై లాంటి నగరాల్లో కూడా ఈ చొర్ బజార్ లు ఉన్నాయి .అలాగే హైద్రాబాదు లోని అబిడ్స్ సమీపంలో కల జగదీశ్ మార్కెట్ లో దొరికే పొన్లన్నీ దొంగిలించడం వలన ఇక్కడికి తెచ్చి అమ్మినవే. హైదరాబాద్ లో ఎక్కడ ఫోన్ పోయిన ఇక్కడ ప్రత్యక్షమవుతుంది అంటే ఆశ్చర్యానికి లోనయ్యాల్సిన అవసరమే లేదు.