మన దేశంలో సెకండ్ వేవ్ లో ఒక్కసారిగా విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు బ్రిటన్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి ధాటికి బ్రిటన్ లో 11 రోజులకు ఒకసారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అయితే కరోనాలో ఉన్న వేరియంట్లు అన్నికంటే డెల్టా వేరియంట్ అత్యంత ప్రధాన రకంగా మారిందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. ప్రస్తుతం ఈ డెల్టా వేరియంట్ బ్రిటన్ ను, అమెరికాను కలవరపెడుతోంది..

ఈ సంవత్సరం మే 20 నుంచి జూన్ 7 వరకు నిర్వహించిన లక్ష స్వాబ్ పరీక్షల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. అమెరికాలో ఈ డెల్టా వేరియంట్ ను అత్యంత ఆందోళనకరమైనదిగా గుర్తించారు. వేగంగా వ్యాప్తిచెందే సామర్థ్యాన్ని పెంచుకున్న ఇది అన్ని వేరియంట్లకంటే జోరు మీద ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.



























