బ్రేకింగ్ న్యూస్..పేలిన ఇండిగో విమానం టైరు, మంటలు, విమానంలోనే రోజా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..లైవ్ వీడియో..

0
640

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఇండిగో విమానం ముందు టైరు పేలింది. అది గమనించిన పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ విమానంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.

ఒక్కసారిగా మంటలు రావడం, రెండు గంటలపాటు విమాన డోర్లు తెరుచుకోకపోవడంతో విమానంలోని 120మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో విమానం దిగొద్దని ప్రయాణికులకు విమాన సిబ్బంది తెలిపారు.

విమాన సిబ్బందితో ఆందోళనలో ఉన్న ప్రయాణికులు కాసేపు వాగ్వాదానికి దిగారు. అయితే, సరైన సమయంలో మంటలు ఆర్పేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన రోజా.. ఆ తర్వాత హైదరాబాద్‌కు ఈ విమానంలో వచ్చారు.

కాగా, మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత ప్రయాణికులను విమాన సిబ్బంది సురక్షితంగా కిందికి దించారు. ప్రమాద ఘటనతో తాను కూడా ఆందోళన చెందానని, విమాన సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని రోజా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here