బ్రేకింగ్ న్యూస్..సుధీర్ రేష్మి వైభవంగా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు..

0
814

మెజీషియన్ అవ్వాలని హైదరాబాద్ వచ్చిన సుదీర్ కమెడియన్ వేణు ద్వారా జబర్దస్త్ లోకి వచ్చి సుడిగాలి సుధీర్ గ గుర్తింపు తెచ్చుకున్నాడు.టీం లో ఒక పార్టిసిపెంట్ గ వచ్చిన సుధీర్ అతి తక్కువకాలం లోనే తన టాలెంట్ ద్వారా, తన కామెడీ టైమింగ్ తో అందరిని బాగా నవ్వించి టీం లీడర్ పొజిషన్ కి చేరుకున్నాడు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనని తానూ ఇంప్రూవ్ చేసుకున్న సుధీర్ కి ఢీ డాన్స్ షో లో కూడా టీం లీడర్ గ ఉండే ఛాన్స్ వచ్చింది. ఇందులో కూడా ప్రదీప్ ధీటుగా పంచులు వేస్తూ అలరిస్తున్నాడు. ఈ రెండు షో ద్వారా సుధీర్ కి సినిమాలలో నటించే ఛాన్స్ లు కూడా వస్తున్నాయి. సుధీర్ ఇప్పుడు రెండు చేతుల సంపాదిస్తూ బాగా స్థిరపడిపోయాడు.

ఇక రష్మీ విషయానికొస్తే జబర్దస్త్ షో ద్వారా గ్లామరస్ యాంకర్ గ పేరు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గ కూడా కొన్ని సినిమాలు చేసింది. తన అందచందాలతో బుల్లి తేరా ద్వారా కూడా యువతని ఆకట్టుకోవడం రష్మీ కి మాత్రమే సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయానికొస్తే సుధీర్ కి, రష్మీ కి మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఇప్పటికే చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తమ మధ్య అలాంటిదేం లేదని ఇద్దరు చెప్పుకొచ్చారు.

కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన చూసి వీరిద్దరికి పెళ్లి అయిపొయింది అనుకుంటున్నారు అంతా. రష్మీ, సుధీర్ జంటగా రోజా, శేఖర్ మాస్టర్, నాగబాబుల వద్దకు వెళ్లి శుభలేఖ ఇచ్చి తమ పెళ్ళికి రావాలని ఆహ్వానించారు. వారంతా కూడా మీ ఇద్దరికీ పెళ్లా అని ఆశ్చర్యపోయారు. జబర్దస్త్, ఢీ షో పార్టిసిపెంట్స్, జెడ్జెస్ అంత కలిసి వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించారు. తలంబ్రాలు పోసుకోవడం, బిందెలో ఉంగరాలు తియ్యడం వంటివి చూస్తే నిజమైన పెళ్లిలాగా అనిపించక మానదు.

ఈ మధ్య కొన్ని చానెల్స్ ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి కూడా ఉగాది పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన అహనా పెళ్ళంటా షో లో భాగంగానే జరిగిందా లేక ఆ షో లో వీరిద్దరికి నిజంగానే పెళ్లి చేసేశారా అనేది తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పెళ్ళికొడుకు గెటప్ లో సుధీర్, పెళ్లి కూతురు గెటప్ లో రష్మీ అదుర్స్ అనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here