భార్యకు ఫేస్ బుక్ లో లవర్ ఉన్నాడని తెలిసి ఓ కంప్యూటర్ ఇంజనీర్ భార్యను ఏం చేశాడో తెలుసా?!!

0
668

ఇప్పుడు ఉన్న కాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్లపై ఆసక్తి చూపటం తప్పులేదు. అయితే పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేయడం.. ముక్కు ముఖం తెలియని వారిని నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ప్రమాదమేనని మానసిక వైద్యులు అంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్ల ద్వారా ఏర్పడే స్నేహంతో ప్రపంచంలో ఎన్నో కుటుంబ సంబంధాలు తెగతెంపులు అవుతున్నాయని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే వీటిలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మీ కోసం.. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా ఉన్న వ్యక్తికి.. ఆతని తల్లిదండ్రులు ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి విదేశాలకు పంపించేశారు. ఆ అమ్మాయి గ్రామంలో కలివిడిగా పెరగడంతో విదేశాల్లో ఒంటరి జీవితానికి ఇష్టపడలేకపోయింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ఆమెకు కంప్యూటర్ నేర్పించడం.. ఫేస్ బుక్, ట్వట్టర్‌తో కాలక్షేపం చేయమని చెప్పి ఆఫీసుకు వెళ్లేవాడు. అంతా తన ఉద్యోగ కార్యకలాపాలకే వెచ్చించే అతగాడు ఆమెకు అసలు సమయం ఇచ్చేవాడు కాదు. దీంతో ఆమెలో ఒంటరితనం బాగాపెరిగిపోయింది. అదిగ్గో అలా దొరికిన ఎమ్టీ ప్లేస్ లోకి సరిగ్గా వేరొకడు చాకచక్యంగా దూరిపోయాడు.అలా ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తితో ఆ అమ్మాయి తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది. అంతేగాకుండా వీరిద్దరి మధ్య స్నేహం చాలా దూరం వెళ్లిపోయింది.

తన భార్యకు ఫేస్ బుక్ లో లవర్ దొరికిన సంగతిని లేటుగా తెలుసుకున్న ఆ ఇంజనీర్.. ఆమెను మందలించకుండానే ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి.. ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేసుకోండని చెప్పి పెద్ద మనస్సుతో స్వదేశానికి పంపించేశాడు. అయితే తన అమ్మాయికి దొరికిన ఫేస్ బుక్‌ స్నేహితుడిపై ఆమె తల్లిదండ్రులు ఆరా తీస్తే ఫోన్ నెంబర్ నకిలీదని తేలింది. అంతేగాకుండా..

ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఫేస్ బుక్ అకౌంట్‌ను కూడా క్లోజ్ చేసేశాడని తెలిసి షాక్ అయ్యారు.. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆ అమ్మాయి పశ్చాత్తాపపడి భర్త వద్ద క్షమాపణలు కోరింది. అయితే ఆ భర్త మాత్రం ఆమెను అంగీకరించే మనస్తత్వంలో లేడు. ఇందుకు పరిష్కారం కోసం మానసిక వైద్యులను సంప్రదించాడు. ఈ సమస్యకు ఇంజనీర్ కూడా ఓ కారణమని వైద్యులు చెప్పారు.

గ్రామంలో పుట్టిపెరిగి కలివిడిగా తిరిగిన అమ్మాయిని ఒంటరిని చేయడం ద్వారానే ఇలాంటి పరిణామాలకు దారి తీసిందని, ఆమెను పై చదువులు చదివించి.. ఆమెకంటూ ఓ ఉద్యోగాన్ని ఏర్పరిస్తే ఆమెలో మార్పు వస్తుందని సలహా ఇచ్చారు వైద్యులు. అంతేగాకుండా ఆమె చేసిన తప్పును క్షమించి స్వీకరించాల్సిందిగా.. చేసిన తప్పును మళ్లీ మళ్లీ దెప్పిపొడవకుండా అన్యోన్యంగా జీవించాల్సిందిగా వైద్యులు సూచించారు. కానీ ఈ సలహాలను ఆ ఇంజనీర్ స్వీకరిస్తాడో లేదో డౌటే.. సో మీరు ఫేస్ బుక్, ట్విట్టర్లు ఉపయోగిస్తుంటే కాస్త జాగ్రత్తపడండి అమ్మాయిలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here