నేను టీడీపీ నేతను అయితే.. మరి కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు ? మంత్రులకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..

0
508

తనపై చేసిన విమర్శలు చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేయడంకోసం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పోటీపడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్‌ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తానూ కాంగ్రెస్‌లో చెరక ముందే టీడీపీ పార్టీతో పాటూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ నేపధ్యంలో జీతభత్యాలు, గన్‌మెన్లు, పీఏను అప్పుడే ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తాను టీడీపీ నేతను అంటూ పదే పదే గొంతు చించుకుని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here