మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపద్యంలో చిత్ర పరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సి ఉండగా.. 3 నెలల ముందే పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, నటి హేమ ప్రకటించారు. ఇక ఈ నేపధ్యంలో మా ఎన్నికల్లో మొదటి నుంచీ చురుకైన పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తాజగా తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.

ఈ నేపధ్యంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే ఎన్నికలను ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నా’అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో సీనియర్ నటి జయసుధ, హీరో శ్రీకాంత్, యాంకర్ అనసూయ, నిర్మాత బండ్ల గణేశ్, సుడిగాలి సుధీర్ తదితరులు ఉన్నారు.
ప్రకారాజ్ ప్యానల్ సభ్యులు వీరే
1. ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్‌రావు లు ఉన్నారు.






























