రంగస్థలంలో సినిమాలో రంగమ్మత్త పాత్రను హీరోయిన్ రాశి ఎందుకు చేయనందో తెలుసా ?

0
2096

పెదాలపై చిరునవ్వులు చిందే రాశి.. కల్మషం లేని మంచి మనిషి.. శుభాకాంక్షలు సినిమాతో తెలుగు పరిశ్రమ పరిచింది ఎర్రతివాచీ.. చక్కని అభినయం అంతకుమించిన వినయం.. అదే కదా మన సంప్రదాయం. చెన్నై లో పుట్టి పెరిగిన రాశి తండ్రిగారు సినీ పరిశ్రమకు చెందిన వారే… తాత గారైతే పద్మాలయ వాహిని స్టూడియోస్ కి జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. అలా సిని పరిశ్రమలోకి రాశి అడుగుపెట్టడానికి సులువైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రావుగారిల్లు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం లో జగపతిబాబుతో శుభాకాంక్షలు సినిమాలో నటించింది.

పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత చిత్రంలోని హీరోయిన్ పాత్రకు చిరంజీవి భార్య సురేఖ రాశిని తన ఇంటికి పిలిపించుకొని ఆడిషన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వదిన గారు చెప్పడంతో రాశిని ముత్యాల సుబ్బయ్య గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు.ఆ సినిమా మంచి విజయం సాధించింది.

ఆ తర్వాత1998లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పందిరి మూవీలో అందురాలిగా నటించి ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకుంది. 1999 లో SP ప్రొడక్షన్స్, చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేయసి రావే సినిమాలో నటించిన రాశికి నటనాపరంగా మంచి మార్కులు పడ్డాయి. సౌందర్య తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మంచి సాంప్రదాయబద్ధమైన గృహిణి పాత్రలో రాసి కనిపించారు.

వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆర్తి అగర్వాల్, రాశి హీరో హీరోయిన్లుగా అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత.. ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత కేరీర్ బాగానే ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు ముందుగా తనను అప్రోచ్ అయ్యారని.. హీరోయిన్ రాశికి కథ వినిపించడం, ఆమెకు ఆ పాత్ర నచ్చడం కూడా జరిగిపోయాయి. అయితే 1980ల్లో గ్రామీణ మహిళ వేషధారణకు తగ్గట్టుగా మోకాళ్ల దాకా చీర చుట్టుకుని, గ్లామర్ ఒలింకించే సీన్లలో నటించాల్సి ఉండడంతో తాను ఆ ఆఫర్ ని సున్నితంగా ‌వదులుకున్నానని రాశి చెప్పుకొచ్చారు.