రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో సుదీప్ లేడట.. క్లారిటీ ఇచ్చిన సుదీప్..!!

0
310

“ఆర్.ఆర్.ఆర్” బాహుబలి తరువాత జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్.ఆర్.ఆర్”. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంభిందించిన ఒక వార్త వైరల్ అవుతున్నది. అదే రాజమౌళి చిత్రం ఆర్. ఆర్. ఆర్. చిత్రంలో కిచ్చా సుదీప్ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలను ఖండిస్తూ సుదీప్ ట్విట్టర్ లో ఒక క్లారిటీ ఇచ్చాడు. “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో నేను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు విని సంతోషం వ్యక్తం చేస్తున్న వారందరికీ ఒక విషయాన్నీ తెలియజేస్తున్నాను. మీరు విన్న ఆవార్తల్లో ఏ మాత్రము నిజం లేదు. ఈ సినిమాకి సంబందించి నాతో ఎవరు ఎటువంటి సంప్రదింపులు జరపలేదంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. గతంలో రాజమోళి చిత్రం బాహుబలిలో సుదీప్ నటించిన విషయం అందరికి తెలిసిందనే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here