అనారా గుప్త. నటి గా కంటే కూడా వివాదాస్పద వ్యక్తిగా ఈమె చాలా పాపులర్. 15 ఏళ్లకే మిస్ కాశ్మీర్ గా ఎంపికయ్యి అందాల కిరీటం దక్కించుకుంది. మిస్ జమ్మూకాశ్మీర్ గా చాలా బాగా ఫేమస్ అనారా గుప్తా. కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి అందరితో ప్రసంశలు అందుకుంది. ఆ తర్వాత ఓ అసభ్యకర వీడియోలో కనిపించి దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఇటీవల తన అందచందాలతో, మాయ మాటలతో రూ.200 కోట్లు కొల్లగొట్టి మరోసారి అంతర్జాతీయ స్థాయి వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది అమ్మడు.. ఇంతకూ ఈవిడ గారు వెల్లబెట్టిన ఘనకార్యం గురించి మీకు చెబితే కళ్లు గిర్రున తిరక్క మానవు..

అనారా గుప్తా బోజ్ పురీ సినిమాలు, సీరియల్స్ లో చేస్తూ భాగానే ఫేమస్ అయింది. తన పెర్ఫార్మెన్స్ తో కొద్ది కాలంలోనే చాలా ఫేమస్ అయింది. అయితే అంతవరకు ఆమె ఆగితే ఏ గొడవా లేదు. కాని కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది ఆమె. అది అక్రమమా? సక్రమమా? జాంతా నై సంపాదించామా? లేదా? అని మాత్రమే అనుకుంది. తను అనుకుందే తడవుగా తన అందచందాలు, మాయమాటలనే పెట్టుబడిగా పెట్టుకుంది. 10 మంది అనుచరులతో స్వంతంగా ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంది. ఇక చూడండి బాలీవుడ్ రచయితలు సైతం రాయలేని సినిమా స్టోరీలను మించిన క్రిమినల్ యాక్టివిటీస్ చేసేసింది ఈ అమ్మడు..

సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానంటూ అందర్నీ నమ్మించింది. అందు కోసం ట్రైనింగ్ ఉంటుందని, ఆ తర్వాత అవకాశాలు ఇప్పిస్తానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన వేలాది మంది డబ్బులు కట్టారు. 10, 20 కోట్లు కాదు.. ఏకంగా ఇలా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమాలలోనూ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది దగ్గర లక్షలు వసూలు చేసింది. ఇలా తను ఐదుగురినో పదిమందినో బోల్తా కొట్టించిందని అనుకుంటున్నారా? కాదు ఏకంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 45వేల మందిని చీట్ చేసింది. నెలలు గడుస్తూ ఒక్కరికి కూడా అవకాశాలు ఇప్పించకపోవటంతో.. మోసపోయాం అని గ్రహించిన బాధితులు ఆమెపై కేసులు నమోదు చేశారు..

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో అనారా గుప్తా బాధితులు 45వేల మంది ఉంటారని చెబుతున్నారు లక్నో పోలీసులు. రెండు రాష్ట్రాల్లో కలిపి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయం సీరియస్ కావటంతో వారం రోజులుగా కనిపించకుండాపోయింది ఈ అమ్మడు. దీంతో లక్నో, అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. లక్నోలో ఆమె సహాయకుడిని అరెస్ట్ చేశారు. అనారా ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు లక్నో పోలీసులు.. సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసే అనారా గుప్తా లాంటి కిలాడిల చేతిలో మోసపోకండి..



























