కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయనుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ దీనికి సంబంధించిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

75 శాతం వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి కొని అందరికీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించాల్సిందేనని చెప్పగా.. తెలంగాణ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆ ఖర్చు తాము భరిస్తామని ప్రకటించాయి. అనంతరం మోదీ సర్కార్ కూడా అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటన చేసింది.



























