వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్, నిత్యం ఎవరినో ఒకరిని బూతులు తిడుతూ వార్తల్లో ఉండే నటి శ్రీరెడ్డి. ఈ మధ్య సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా ఫెస్ బుక్ లో తరచూ పోస్ట్ లు పెడుతూ టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయనాయకులపై సెటైర్ లు కూడా వేస్తుంది. టాలీవుడ్ లో వివాదాలతో కారణంగా మకాం చెన్నై కి మార్చిన ఈ చిన్నది ఇంకా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఘాటు విమర్శలే చేస్తుంది. తిట్లదండకం అందుకుంటోంది. అయితే ఈ మధ్య కాస్త తిట్ల దండకం తగ్గించి కొత్తగా బిజినెస్ మీద ద్రుష్టి పెట్టింది.

అదేనండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో చక్కగా చీర కట్టుకుని వంటలక్కలాగా వంటలు చేయడం మొదలు పెట్టింది. తనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఛానల్ ని బాగానే ప్రమోట్ చేసుకుంటుంది. తనకున్న ఫాలోయింగ్ ని ఛానల్ ద్వారా ఎన్ క్యాష్ చేసుకునే పనిలో పడింది. తనకి తెలిసిన వంటకాలను ప్రిపేర్ చేస్తూ షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. అంతేకాదు ఆమెకున్న ఫాలోయింగ్ తో తన వీడియోస్ కి భీపత్సంగా వ్యూస్ వస్తున్నాయి. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అంతలేంది.

అయితే కాంట్రావర్సీలతో ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ భామ సడెన్ గా చీరకట్టులో, ఇంత పద్దతిగా మారిపోయి వంటలు చేయడం అది వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో రోజు అప్డేట్ చేస్తుండటంతో అందరు షాక్ అవుతున్నారు. శ్రీ రెడ్డిలో ఈ మార్పుతో అయినా కొంచెం ఈ కాంట్రవర్సయిలకు దూరంగా ఉంటుందని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here