పారిస్ లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయం.. అప్పుడే వచ్చిన ఒక విమానం అండర్ క్యారేజ్ లో పదేళ్ల బాలుడి మృతదేహాన్ని గుర్తించారు విమానాశ్రయం అధికారులు, ఈ విషయాన్నీ ఎయిర్ ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది.

ఐవరీకోస్ట్ నుంచి వచ్చిన ఈ విమానం చక్రాలు లోనికి ముడుచుకునే (ల్యాండింగ్ గేర్ వెల్ ) చోట దాక్కుని వచ్చేందుకు ప్రయత్నించడం వలన ఈ బాలుడు మృతి చెందాడని ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.. దీనిపై విచారణ జరుగుతుంది.

బాలుడు ప్రయాణించిన చోటు

వివరాలలోకి వెళితే ఐవరీకోస్ట్ లోని అబిద్ జాన్ నుంచి పారిస్ మంగళవారం సాయంత్రం ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం.. బుధవారం ఉదయం స్థానిక కాలమానా ప్రకారం 6:40 గంటలకు ఈ బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారని అధికారులు తెలిపారు.

అబిద్ జాన్ విమానాశ్రయం లోని భద్రతా వైఫల్యాన్ని ఇది ఒక ఉదాహరణ గా భావించవచ్చని అక్కడి అధికారి ఒకరు అన్నారు.
అయితే ఇలాంటి ఘటనలు తొలిసారి కాదని ఇంతకుముందు కుడా ఇలా దొంగచాటున విమానం ఇతర భాగాలలో ప్రయాణించిన వాళ్ళు ఉన్నారని, యూఏస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 1947 నుంచి 2012 మధ్య ప్రపంచవ్యాప్తంగా 85 విమానాశ్రయాల నుంచి 96 మంది ఇలా దొంగచాటుగా వెళ్లేందుకు ప్రయత్నించారని అయితే వారిలో గమ్యస్థానాలకు చేరుకున్న వారు చాలా తక్కువ మంది వున్నారని తేలింది.

ఇలా ప్రయాణించి బ్రతికి బట్టకట్టిన వాళ్ళు కూడా వున్నారు, 1996 లో భారత్ కి చెందిన పర్దీప్ సైనీ , విజయ్ అనే అన్నదమ్ములు ఢిల్లీ నుంచి 10 గంటల పాటు ఇలా రహస్యంగా ప్రయాణించి లండన్ వెళ్లారు. వీరిలో 23 ఏళ్ళ పర్దీప్ ప్రాణాలతో బయట పడ్డాడు కానీ విజయ్ మాత్రం హీత్రూ విమానాశ్రయం సమీపిస్తుండగా విమానం నుంచి జారిపడి మరణించాడు. ఇలా ప్రాణాలు పోగుట్టుకున్న వారు చాలామందే వున్నారు.

ఢిల్లీ నుంచి లండన్ కు రహస్యంగా ప్రయాణించిన పర్దీప్ సైనీ

అయితే కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా విమానంలో ఎలా దాక్కుంటున్నారు ??

విమానం టేకాఫ్ అయ్యే ముందు ఆ విమానాశ్రయం లోని భద్రతా సిబ్బంది తనికీలు చేస్తారు. కానీ తనికీలు పూర్తయ్యాక చివరి నిమిషం లో ఇలాంటి వాళ్ళు విమానంలోకి చొరబడతారని, విమానాశ్రయాల్లో పనిచేసే కొంత మంది సిబ్బంది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని మరియు విమానాశ్రయం లో బాగా తెలిసిన సిబ్బంది ద్వారా వెళ్లేవారు మరికొందరు ఉంటారని, అలా ప్రయాణించడం చాలా ప్రమాదకరమని, వారికి సరిఅయిన అవగాహన లేక ఇలా చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమయినా ఇలాంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here