నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.






























