సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్టు.. ఇకపై గ్రాడ్యుయేట్లకు పండగే !!

0
311

2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం పలు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు 37 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనివల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని రాష్ట్రంలోని పలు సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించింది.

అయితే తాజాగా గ్యాడ్యుయెట్లు, రోజువారీ కూలీలు, క్లర్కులు, సూపర్ వైజర్లు.. ఇలా పలు రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు అందరికి శుభవార్త చెప్తూ తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. మూడేళ్ళ క్రిందట ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు వల్ల ఇప్పటినుండి గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19వేల రూపాయిలు కానుంది.

అయితే తాజాగా ఆ నోటిఫికేషను తిరిగి అమలు చేయాలనీ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19,572 రూపాయిలు అయ్యింది. ఈ కేసుకు వ్యతిరేకంగా దాఖలు అయినా ఆపిల్స్ అన్నింటిపై త్వరితగతిన విచారణ చేపట్టి పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది.

అదే నోటిఫికేషన్ లో అనేక నోటిఫైడ్ జాబ్స్ కు కనీస వేతనం నిర్ణయించారు. నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు 14,842 రూపాయిలు, సెమి స్కిల్డ్ వర్కర్ కు నెలకు 16,341 రూపాయిలు, ఎక్సపీరియెన్సుడ్ వర్కర్ కు నెలకు 17,991 రూపాయిలు గా నిర్ణయించారు. అలాగే క్లర్క్ లు, సూపర్ వైజర్లుకు 10వ తరగతి పాస్ అయినా వారికీ 16,341 రూపాయలుగా, ఇంటర్ పాస్ అయిన వారికీ 17,991 రూపాయలుగా, డిగ్రీ, ఆపైన విద్యార్హత ఉన్న వారికీ 19,572 రూపాయిలుగా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here