సామాన్యులను బయపెట్టుస్తున్న మోడీ నిర్ణయం, బ్యాంకులు అలా చేస్తే మీ డబ్బు పాయినట్లే ..!ఎలానో తెలుసా …!

0
807

భద్రంగా ఉంటుందని మీ సొమ్ము దాచుకున్న బ్యాంకే దివాలా తీస్తే..?? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లు మీ ఖాతాలోని సొమ్ముకు ప్రస్తుతమున్న భద్రత కూడా కరువయ్యేలా చేయనుందని ఆర్థికరంగ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పిల్లల చదువు కోసం… పెళ్లి కోసం… రిటైరయ్యాక శేష జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడపడం కోసం… రోగాలు వచ్చినా తట్టుకోవడం కోసం…ఇలా చాలా మంది బ్యాంకుల్లోనే డబ్బులు వేస్తారు. మరీ ముఖ్యంగా ఫిక్స్ డిపాజిట్లు చేస్తారు. వడ్డీ తక్కువ అయినా అసలుకు గ్యారెంటీ అని వారి నమ్మకం. ఎందుకంటే మనదేశంలో ప్రభుత్వ బ్యాంకులు అంటే జాతీయ బ్యాంకులు ఇంతవరకూ ప్రజల డబ్బును ఎగ్గొట్టిన చరిత్ర లేదు. కాని ఇప్పుడు ఓ ప్రమాకరమైన చట్టం చేసేందుకు మోఢీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రకారం మీరు డబ్బు దాచుకున్న బ్యాకు నష్టపోయినా, దివాళా తీసినా ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యతలేదు..

ఇది ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లు పార్లమెంటు సెలక్ట్‌ కమిటీ పరిశీలనలో ఉంది. అది ఆమోదిస్తే వెంటనే కేబినెట్‌ క్లియర్‌ చేయాలి.. ఆ తరువాత వచ్చే సమావేశాల్లోనే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఇప్పటి వరకు ఏదయినా జాతీయ బ్యాంకు దివాళాతీస్తే దానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉండేది. ప్రజల డబ్బు తిరిగి ఇచ్చేందుకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చేవారు. సో మనం డిపాజిట్ చేసుకున్న డబ్బుకు భారత ప్రభుత్వమే గ్యారెంటీ అన్నమాట. కాని ఇక నుంచి ఆ బ్యాంకుకు, అందులోని మీ డబ్బుకు నాకు ఎలాంటి గ్యారెంటీ లేదంటోంది కేంద్ర ప్రభుత్వం.


ఈ కొత్త చట్టం ప్రకారం ఓ కార్పొరేషన్ ఏర్పాటవుతుంది. బిల్లులో ఈ కార్పొరేషన్‌కు ఎంతగా తిరుగులేని అధికారాలు కట్టబెట్టారంటే.. దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్‌ రద్దు చేసేయవచ్చు. అంటే దీని అర్థం.. మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదు.అంతేకాదు ఈ కొత్త చట్టం ప్రకారం మనం పిల్ల పెళ్లికో లేక చదువుకో ఓ పది లక్షల రూపాయలను ఐదేళ్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామనుకుందాం. బ్యాంకువారు దానిని మన అనుమతి లేకుండానే 20 ఏళ్లకు డిపాజిట్ పిరియడ్ మార్చేయవచ్చు. అంటే ఏ అవసరం కోసం మీరు దాన్ని దాచుకున్నారో అవసరాన్ని తీర్చుకోవడానికి ఆ డబ్బు మనకు లభించదన్నమాట. సపోజ్ మనం 15 లక్షలు సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌లో దాచుకుంటే దానిని లక్ష రూపాయలకు మార్చేయవచ్చు. లేదా ఆ 15 లక్షల మొత్తాన్ని తమకు నచ్చినట్లు ఐదేళ్లకో లేక పదేళ్లకో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చేయవచ్చు. ఇలా చేయడానికి దేనికీ మీ అనుమతి అవసరంలేదన్నమాట మోఢీ ప్రభుత్వం తేబోతున్న కొత్త బిల్లు ప్రకారం..


ప్రస్తుతం మీ ఖాతాలోని సొమ్ములో లక్ష రూపాయల వరకు బ్యాంక్‌ బీమా కవరేజీ కల్పిస్తుంది. ఒకవేళ బ్యాంక్‌ దివాలా తీసినా రూ.లక్ష వరకైతే తిరిగి చేతికొస్తుంది. అంతకు మించి జమ చేసిన సొమ్ముకు మాత్రం ఎలాంటి భద్రత ఉండదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లుపై కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ముకు ఇప్పుడున్న భద్రత కూడా లేకుండా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, దివాలా తీసిన బ్యాంకు డిపాజిటర్ల సొమ్ముతో కొంత నష్టాలను పూడ్చుకునేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లులోని ‘బెయిల్‌ ఇన్‌’ ప్రొవిజన్‌ వీలుకల్పిస్తుంది. అయితే, బ్యాంకర్లు మాత్రం ఈ బిల్లు విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here