సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తి, ఖంగుతిన్న విజయ్ చందర్ !!

0
275

సాధారణంగా భజన చేయాలి అనుకునేవారు పార్టీ మీటింగుల్లోనో, లేదా ప్రెస్ మీట్ పెట్టో చేస్తువుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, వైసీపీ నేత, సినీనటుడు విజయ్ చందర్ రూటే సెపరేటు.. ఆయనను ఏపీ ఫిలిం అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన సీఎం జగన్ మీద స్వామి భక్తి చూపించబోయి ఖంగుతిన్నారు. విజయ్ చందర్ గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో జరిగిన ఒక కార్యక్రంలో పాల్గొన్నారు. అదేవేదిక మీద విజయ చందర్ తో పాటుగా మరికొందరు అతిధులు కూడా వేదికను అలంకరించారు. అయితే వేదికమీద ప్రసంగించిన సమయంలో సీఎం జగన్ పాలన బాగుంది అంటూ జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ వేదికమీద రాజకీయాలు ఎందుకు అంటూ అయన ముందే స్టేజి మీద ఉన్న అతిధులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, స్టేజి దిగి వెళ్లిపోయారు. అనంతరం అయన కారులో వెళుతుండగా అడ్డు పడిన స్థానికులు ఆందోళన చేస్తూ విజయ్ చందర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేయడంతో… చేసేదేమి లేక క్షమాపణలు చెప్పి అక్కడనుంచి బయటపడ్డారు విజయ్ చందర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here