సుకన్య సమృద్ది యోజన పథకం అనేది 10 సంవత్సరాల లోపు బాలికలకు సంబంధించిన పథకం.ఈ ఖాతాను బాలిక యొక్క తల్లిదండ్రులు లేక సంరక్షకులు మాత్రమే తెరవాలి. ఒకవేళ బాలిక అనాథ అయితే ఆ బాలిక ను దత్తత తీసుకున్నవారు చట్టపరంగా దత్తత తీసుకున్న పత్రాలను సమర్పించి ఖాతా తెరువవచ్చు. అలాగే మొదటి సంతానము ఆడపిల్ల అయి ఉండి రెండవ సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుడితే ముగ్గురికి మూడు ఖాతాలు తీయవచ్చు.ఒక బాలికకు ఒక అకౌంట్ మాత్రమే తీయాలి. అలాగే అకౌంట్ తీసేటప్పుడు బాలిక జనక దృవీకరణ పత్రము తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోటోలు మరియు గుర్తింపు కార్డు చిరునామాను ధృవీకరించే పత్రాలు అలాగే ఖాతా తెరిచేందుకు 1000 రూపాయల నగదు తీసుకొని ఫామ్ నింపి ఖాతాను తెరవాలి ఈ నగదు జమ చేసేటప్పుడు D D రూపంలో గానీ చెక్ రూపంలో గానీ చెల్లించాలి. ఏదైనా బ్యాంక్ లో కానీ తపాలా కార్యాలయం లో కానీ ఈ ఖాతాను తెరువవొచ్చు.