సెప్టెంబర్ 23 రోజు భూమి అంతం కానుందా… మానవ జాతికి చివరి రోజు అదేనా..!!

0
915

యుగాంతం వాదన మరోసారి తెరపైకి వచ్చింది. కాన్ స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్. నిబిరు అనే గ్రహం ఢీకొట్టి….భూమి నామరూపాలు లేకుండా పోతుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. యుగాంతం గురించి చాలా ఏళ్లుగా వాదిస్తున్న డేవిడ్….ఈ సారి డేట్ తో సహా ప్రకటించారు. సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యలో నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి వస్తుందని, దాని గురుత్వాకర్షణ శక్తికి…భూమి అంతమవడం ఖాయమంటున్నారు. అయితే డేవిడ్ వాదనలు నాసాతో పాటూ పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చిన్న చిన్న గ్రహ శకలాలు భూ కక్ష్యలోకి రావడం మామూలు విషయమేనని, కానీ వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగదంటున్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.