టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. అగ్ర హీరోలందరితో నటించిన అనుభవం ఆమెది. అందానికి తగ్గ అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. విజయవాడలో జన్మించిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. చిరుతో సమానంగా స్టెప్పులేసి అలరించింది.

అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి భాషల్లో నటించింది. రీసెంట్ గా తారక్, బన్నీ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెరుపులు మెరిపించింది.

తెలుగు చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ 2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడంతో ఇద్దరు కలిసి కొత్త జీవితం గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.


































