ఆయా రంగాల్లో కొనసాగుతున్న దిగ్గజాల పిల్లలు సైతం వారి అడుగు జాడల్లోనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. డాక్టర్ల పిల్లలు డాక్టర్లుగా.. ఇంజినీర్ల పిల్లలు ఇంజినీర్లుగా.. లాయర్ల పిల్లలు లాయర్లు అయినట్లుగానే యాక్టర్ల పిల్లలు యాక్టర్లుగా మారుతున్నారు.

అయితే హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు తప్ప.. హీరోయిన్ల పిల్లలు హీరోయిన్లుగా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే కొంత మంది పాతతరం హీరోయిన్ల కూతుళ్లు మాత్రం ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ల బిడ్డలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
లక్ష్మి- ఐశ్వర్య

ఒకప్పటి టాప్ హీరోయిన్ లక్ష్మి. తన కూతురే ఐశ్వర్య. ఈమె కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇద్దరు కలిసి సమంతా నటించిన ఓ బేబి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు.
శ్రీదేవి – జాన్వికపూర్

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా హీరోయిన్ గా మారింది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
లిజి- కళ్యాణి ప్రియదర్శన్

ఒకప్పటి మలయాళ టాప్ నటి లిజి. ఆమె కూతురు కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతుంది. హలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
మేనక – కీర్తి సురేశ్

తెలుగు, మళయాల సినిమా పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన మేనక కుతురే కీర్తి సురేష్. మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది కీర్తి.
మంజుల – వనిత, శ్రీదేవి, ప్రీత

పాత తరం స్టార్ హీరోయిన్ మంజుల. ఆమె కూతుర్లు ముగ్గురు హీరోయిన్లు అయ్యారు. వారే వనిత, ప్రీత, శ్రీదేవి. దేవి సినిమాతో వనిత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రీత రుక్మిణితో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈశ్వర్ తో శ్రీదేవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
సంధ్య- జయలలిత

జయలలిత తల్లి కూడా సినిమా నటే. ఆమె ప్రోత్సాహంతోనే జయలలిత సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అయ్యింది.
రాధ – కార్తిక, తులసి

ఎయిటీస్ లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రాధ. ఆమె ఇద్దరు బిడ్డలు కార్తీక, తులసి హీరోయిన్లుగా మారారు. జోష్ సినిమాతో కార్తీక, కడలి సినిమాతో తులసి తెలుగు జనాలకు పరిచయం అయ్యారు.
జీవిత – శివాని, శివాత్మిక

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ జీవిత. ఆమె ఇద్దరు బిడ్డలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్లు అయ్యారు.
సారిక – శృతిహాసన్, అక్షర హాసన్

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన సారిక కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ సైతం హీరోయిన్లుగా ఎదిగారు. శృతి హాసన్ సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది.

































