హైదరాబాద్ నగర పార్కుల్లో ప్రేమికులు రెచ్చిపోతున్నారు.. ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే తంతు నడుస్తుంది.. ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన ఈ పనులు ఆగడం లేదు.. గత కొన్ని నెలల క్రితం పార్కుల చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఎన్ని చేసిన ప్రేమికులు ఆగడం లేదు.. ఏదో ఒక రకంగా దారి వెతుకుంటూ పాడు పనులు చేస్తున్నారు.. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు… ఈ ప్రాంతాల్లో సందర్శకుల మాట ఎలా ఉన్నా, సెక్యూరిటీ గార్డుల ప్రోత్సాహంతో సాయంత్రానికి ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షలు వాలిపోయి, సినిమాల్లో కనిపించని రొమాంటిక్ సీన్లను చూపిస్తున్నాయి..
హోటళ్లపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో, లవర్స్ పార్కులను ఆశ్రయిస్తున్నారు.. అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా చేతికి అందినంత డబ్బులు వసూలు చేసి సీక్రెట్ ప్లేస్ లను చూపిస్తున్నారని తెలుస్తోంది. ఎవరికీ కనిపించని పోదల మాటు ప్రాంతాన్ని చూపి, ఓ గంట పాటు అటు ఎవరినీ రాకుండా చూసుకోవాలంటే రూ.500, ఆపై చాటుగా ఉండే స్థలాలైతే రూ. 50 నుంచి రూ. 200 వరకూ సెక్యూరిటీ గార్డులు వసూలు చేస్తున్నారు.



























